విజయం అందరికి ఊరికే రాదు. ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణతో సాధించుకోవాలి. చాలా కొద్దిమందికి సులువుగా సక్సెస్ అందుతుంది. మరికొందరికి ఎంత కష్టపడినా సక్సెస్ రాదు. తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయి.. కలెక్టర్ స్థాయికి చేరుకున్న యువకుని సక్సెస్ స్టోరీ చూద్దాం.
బంధాల్లో కూడా వ్యత్యాసం మొదలైందా అన్న అనుమానం కలగకమానదు. కారణం ఇటీవల కాలంలో తెగిపోతున్న భార్యా భర్తల సంబంధాలు చూస్తుంటే అనక తప్పని పరిస్థితి. పురుష అహంకారానికి, ఆలోచనలకు మహిళలు బలౌతూనే ఉన్నారు. చీటికి మాటికి భార్యపై విరుచుకు పడటం, ఆమెతో అస్తమాను గొడవపడటం భర్తకు పరిపాటిగా మారిపోయింది
అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానకు దెబ్బతింటే ఓ రైతన్న తల్లడిల్లిపోయాడు. తన బాధ, ఆవేదనను పాట రూపంలో వ్యక్తం చేశాడు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చాయి. దీంతో ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల కాలం పాటు ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరివీ ఒకే సామాజికవర్గం అయినా సరే వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు మాత్రం అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి ఆ ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రిసెప్షన్ కూడా పెట్టించుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. వీరి రిసెప్షన్‌లో […]
అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టౌన్. సంచర జాతికి చెందిన నిర్మల అనే మహిళ టౌన్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ లు ఏరుకుంటూ ఏడేళ్ల కుమారుడితో జీవనాన్ని కొనసాగిస్తోంది. భర్తతో విడిపోయిన నిర్మల కొంత కాలం నుంచి ఇక్కడే ఉంటూ కుమారుడితో కాలాన్ని గడిపేసేంది. ఇక ఈ మధ్య కాలంలో నిర్మల ఆరోగ్య పరిస్థితి అనుకూలించకపోవటంతో ఇంటికే పరిమితమైంది. దీంతో బయటకెళ్లలేనంత స్థితిలోకి వెళ్లింది నిర్మల ఆరోగ్య పరిస్థితి. కొన్ని రోజుల పాటు అదే పూరి […]