అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట టౌన్. సంచర జాతికి చెందిన నిర్మల అనే మహిళ టౌన్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ లు ఏరుకుంటూ ఏడేళ్ల కుమారుడితో జీవనాన్ని కొనసాగిస్తోంది. భర్తతో విడిపోయిన నిర్మల కొంత కాలం నుంచి ఇక్కడే ఉంటూ కుమారుడితో కాలాన్ని గడిపేసేంది. ఇక ఈ మధ్య కాలంలో నిర్మల ఆరోగ్య పరిస్థితి అనుకూలించకపోవటంతో ఇంటికే పరిమితమైంది. దీంతో బయటకెళ్లలేనంత స్థితిలోకి వెళ్లింది నిర్మల ఆరోగ్య పరిస్థితి.
కొన్ని రోజుల పాటు అదే పూరి గుడిసెలో ఉండటంతో రోజు రోజుకు తన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో చలిగాలుల మధ్య గడిపిన నిర్మల అదే రోజు రాత్రి మరణించింది. తల్లితో పాటే పడుకున్న కుమారుడు లేచి చూసేసరికి కుమారుడు ఎంత లేపిన తల్లి నిర్మల లేవటం లేదు. కాగా తల్లి మరణించిన విషయం తెలియక కుమారుడు ఏడుస్తూ వచ్చిన వాళ్లందరికీ చూపిస్తూ మా అమ్మ లేవటం లేదు..లేపండి అంటూ ఏడుస్తున్న దృశ్యం వచ్చిన వాళ్లందరినీ కన్నీటి పర్యాంతానికి గురి చేసింది.
ఇక స్థానికుల సమాచారం మేరకు ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి శవాన్ని మార్చురీకి పంపారు. ఇక బాలుడుని నిర్మల ఆధార్ కార్డు ఆధారంగా తమ బంధువుల చెంతకు చేర్చారు.