ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చాయి. దీంతో ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల కాలం పాటు ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరివీ ఒకే సామాజికవర్గం అయినా సరే వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు మాత్రం అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి ఆ ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత రిసెప్షన్ కూడా పెట్టించుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. వీరి రిసెప్షన్‌లో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు. ఇదే ప్రాంతంలోని 21 ఏరియాలో నివాసముంటున్న ప్రత్యూష, రాకేష్ గత 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నా.. చివరికి యువతి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి ఈ జంట ఈఏడాది ఏప్రిల్ 6వ తేదిన పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు వీరి పెళ్లి చేసుకోవడంతో జీర్ణించుకోలేపోయారు. అయితే ఇటీవల వరుడు రాకేష్ తమ ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: East Godavari: ఉద్యోగం చేయటం ఇష్టంలేక యువతి ఆత్మహత్య!
బంధువులంతా హాజరై ఫంక్షన్ జరుగుతున్న క్రమంలోనే యువతి బంధువులు ఆ రిసెప్షన్‌లోకి అడుగు పెట్టారు. పెళ్లి ఎందుకు చేసుకున్నావంటూ వరుడి బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వరుడి బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వరుడు రాకేష్ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.