బంధాల్లో కూడా వ్యత్యాసం మొదలైందా అన్న అనుమానం కలగకమానదు. కారణం ఇటీవల కాలంలో తెగిపోతున్న భార్యా భర్తల సంబంధాలు చూస్తుంటే అనక తప్పని పరిస్థితి. పురుష అహంకారానికి, ఆలోచనలకు మహిళలు బలౌతూనే ఉన్నారు. చీటికి మాటికి భార్యపై విరుచుకు పడటం, ఆమెతో అస్తమాను గొడవపడటం భర్తకు పరిపాటిగా మారిపోయింది
దేశంలో గత, ప్రస్తుత పరిస్థితులు విభిన్నం. బంధాల్లో కూడా వ్యత్యాసం మొదలైందా అన్న అనుమానం కలగకమానదు. కారణం ఇటీవల కాలంలో తెగిపోతున్న భార్యా భర్తల సంబంధాలు చూస్తుంటే అనక తప్పని పరిస్థితి. పురుషుడు అహంకారానికి, ఆలోచనలకు మహిళలు బలౌతూనే ఉన్నారు. చీటికి మాటికి భార్యపై విరుచుకు పడటం, ఆమెతో అస్తమాను గొడవపడటం భర్తకు పరిపాటిగా మారిపోయింది. ఒక్కో సమయంలో పని మీదో, ఉద్యోగం నిమిత్తమో బయటకు వెళుతున్న భర్త.. ఇంటికి వస్తున్నాడంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన ఘోర పరిస్థితులకు ఆమెను తీసుకెళ్లిపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. నిజంగా సుజాత విషయంలో ఆ భయమే నిజమైంది.
భార్యను వేధించడమే కాకుండా.. ఆమెను ఉరి కొయ్యకు వేలాడు దీశాడో భర్త రూపంలో ఉన్న విలేకరి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని సింగరేణి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవి అలియాస్ శంకర్‌కు.. చర్ల మండలం ప్రగల్ల పాడు గ్రామానికి చెందిన సుజాతతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌కు విలేకరిగా పనిచేస్తున్నాడు. ఇంటికి వచ్చి రోజూ భార్యను చిత్రవధకు గురి చేసేవాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టడం చేసేవాడు. వీరి గొడవ పంచాయతీ వరకు చేరింది. దీంతో అతడిని ఊరిలోనే ఉండాలని ఆదేశించారు. ఇది మనస్సులో పెట్టుకున్న అతడు భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
ఓ రోజు గొడవ జరిగే క్రమంలో భార్య సుజాతకు నైలాన్ తాడుతో ఉరి వేసి..చంపి.. గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సుజాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే ఆమె ఒంటిపై గాయాలుండటంతో సుజాత బంధువులు, ఇతరులు ప్రశ్నించగా అక్కడి నుండి పరాయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.