నాజూకుగా మారిన నారా లోకేశ్! న్యూ లుక్ అదిరింది!

కాలం అన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అంటారు. ఇందుకే ఏ విషయంలోనైనా ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదు. తనని ఇలా చిన్న చూపు చూసిన వారందరికీ ఇప్పుడు నారా లోకేశ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు కాస్త లావుగా, బొద్దుగా కలిపించిన నారా వారబ్బాయి ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానం ప్రత్యేకం. నాలుగు పదుల రాజకీయ జీవితంలో ఆయన చూడని పదవులు లేవు. అపజయం ఎదురైన ప్రతిసారి ఆయన అంతే స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్ధులు వేసిన అన్నీ ఎత్తులు చిత్తయ్యాయే గాని.. చంద్రబాబుకి నష్టాన్ని చేకూర్చలేకపోయాయి. కానీ.., తన కొడుకు నారా లోకేశ్ విషయంలో మాత్రం జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నారా లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికే కాస్త లావుగా ఉన్నారు. ఆయన చదువు సాగింది ఫారిన్ లో కాబట్టి.., తెలుగు మాట్లాడే సమయంలో కూడా అనేకసార్లు తప్పులు దొర్లాయి. ఇదే అదునుగా తీసుకున్న ప్రత్యర్ధులు లోకేశ్ ని అసమర్దుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో వారు సూపర్ సక్సెస్ అయ్యారు కూడా.

nara 2ఇక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండానే.., లోకేశ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి.., మూడు మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు చంద్రబాబు. దీంతో., లోకేశ్ కి ప్రజా క్షేత్రంలో గెలిచే శక్తి లేకే.., తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయిపోయాడు అంటూ వెటకారాలు చేశారు రాజకీయ ప్రత్యర్ధులు. ఇదే సమయంలో ఆయన ఎన్ని సార్లు బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. ఇక ప్రతి పక్షంలో ఉన్న ఈ రెండేళ్ల కాలంలో ఇలానే బాడీ కామెంట్స్ ఎదుర్కొంటు వచ్చారు లోకేశ్. కానీ.., ఇప్పుడు ఆ లెక్క మార్చారు నారా లోకేశ్. కరోనా నేపథ్యంలో లోకేశ్ కొన్ని నెలలుగా బయటకి రావడం లేదు. ఇంట్లోనే ఉంటూ.., నాయకులతో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్య ఆ మీటింగ్ కూడా లేకుండా పోయాయి. కానీ.., ఇప్పుడు ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ లోకేశ్ జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యాడు. ఆ వీడియోస్ లో నారా లోకేష్ బాగా సన్నబడి, గెడ్డం పెంచేసి న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం లోకేశ్ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో లోకేశ్ ని చూసిన వారంతా.. ఈ సడెన్ మేకోవర్ కి షాక్ అవుతున్నారు. మరి కటౌట్ మార్చిన నారా వారి వారసుడు.. కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే టీడీపీకి పునర్వైభవం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.