గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా సిరికొండ మధుసూదనాచారి

తెలంగాణ తొలి స్పీకర్‎గా పనిచేసిన మధుసూదనాచారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. మేరకు ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‎కు పంపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయనను గవర్నర్ తమిళిసై నియమించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీగా శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

maadhu minఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేశారు. మొదట కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ ఫైలు గవర్నర్ వద్ద పెండింగ్‎లో ఉండటంతో ఎమ్మెల్యే కోటలో ఆయనకు ఎమ్మెల్సీ గా ఖరారు చేశారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పేర్లను పరిశీలించిన కేసీఆర్… చివరకు మధుసూదనాచారికి అవకాశాన్ని కల్పించారు.

korae minఇక సిరికొండ మధుసూదనాచారి టీఆర్ఎస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. భూపాలపల్లి నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడుగా గుర్తింపు ఉంది.