స్పెషల్ డెస్క్- కిటికీ దగ్గర మమ్మీ.. మమ్మీ అని పిలుస్తున్నారెవరో.. ఎంతకీ ఇంట్లో వాళ్లు మాత్రం కిటికీ తెరవడం లేదు. చాలా సేపు మమ్మీ.. మమ్మీ అని పిలిచి ఆలిసిపోయిందా గొంతు. కాసేపయ్యాక చూస్తే పిలుస్తోంది ఎవరో కాదు.. రామ చిలుక. అవును ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ కిటికీ దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ అని పిలలవడం అందరిని ఆకట్టుకుంటోంది. కిటికీని తన ముక్కుతో పొడిచి మరీ యజమానురాలిని పిలుస్తోంది రామ చిలుక. ఎంతకీ వాళ్లు కిటికీ తెరవకపోవడంతో అవతలి వైపు వెళ్లి కూడా ప్రయత్నించింది. ఇలా ఆ రామ చిలుక మమ్మీ మమ్మీ అని పిలిచి పిలిచి అలిసిపోయింది. ఇక ఈ రామచిలుకను ఆ ఇంటివాళ్లు పెంచుకుంటున్నారట. అది అలా కాసేపు షికారుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది.
తీరా వచ్చాక కిటికీ తలుపులు మూసి ఉండటంతో యాజమానురాలిని మమ్మీ.. మమ్మీ అని పిలిచింది. మరి ఇంట్లో వాళ్లకు వినిపించిందో లేదో.. చాలా సేపు పిలుస్తూనే ఉంది రామచిలుక. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రామచిలుకకు మమ్మీ అన్న మాటలే కాదు.. ఇక చాలు, వద్దు, బావుంది, ఏమైంది, అయ్యే అనే మాటలు కూడా వస్తాయట. రామచిలుకకు ప్రత్యేకంగా ఈ మాటలను నేర్పించారట ఇంటి యజమానులు. భలే ఉంది కదా రామచిలుక. ముద్దు ముద్దుగా మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది కదా.