ఆవు పేడ, గో మూత్రంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలంటున్న వైద్యుడు!

Dr Manoj Mittal Cow Dung

ముఖ్యంగా మన తాతలు, ముత్తాతల కాలంలో నాటు వైద్యాన్ని ఎంతో విశ్వాసంతో నమ్మారు. అలా నమ్మటమే కాకుండా వాటిని ఉపయోగించిన అనేక రకాల వ్యాదుల చెర నుంచి వారు బయటపడ్డారని మనకు తెలుసు. అయితే కాలానికి అనుగూణంగా పరిస్థితులు మారుతుండటంతో ఇప్పుడు నాటు వైద్యాన్ని కాస్త పక్కన బెట్టి ఆధునిక వైద్యులు కనిపెట్టిన మందులను వాడుతూ రోగాల బారి నుంచి బయటపడుతున్నాడు.

ఇక మరో విషయం ఏంటంటే..? మన దేశంలో గో మూత్రాన్ని కొంతమంది వ్యక్తులు ఎంతో పవిత్రంగా కొలిచి దానిని సేవంచటం కూడా చేస్తారు. ఏకంగా ఎంబీబీఎస్ పట్టా పొందిన వైద్యులు సైతం ఇప్పుడు ఆవు పేడను, మూత్రాన్ని సేవిస్తున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. హర్యానాలోని ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన డాక్టర్‌ మనోజ్ మిట్టల్‌ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తనే స్వయంగా ఆవు మూత్రం, పేడను సేవించటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నాడు. ఇలా చెప్పటమే కాకుండా స్వయంగా ఆవు పేడను నోట్లో వేసుకుని మరీ చూపిస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు, ఏసీ, ఫ్రీజ్ ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని తెలిపాడు. ఇక ఈ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ ను నివారించేందుకు ఆవు పేడ ఓ దివ్య ఔషదంగా పని చేస్తుందని ఈ ఎంబీబీఎస్ వైద్యుడు చెబుతున్నాడు. అలా ఆవు పేడను తింటున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది. ఇక ఆవు పేడ తినటం వల్ల క్యాన్సర్ ని నివారిస్తుందని మీరు నమ్ముతున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.