30 ఏళ్లుగా టాయిలెట్‌లోనే సమోసాలు రెడీ చేసిన రెస్టారెంట్‌

Samosa

Jeddah Restaurants: కొన్ని హోటళ్లు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటానికో లేక, పోయే కాలమో తెలీదు కానీ, నీచానికి పాల్పడుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు ఆహారం వండి కస్టమర్ల కడుపుకొడుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఓ హోటల్‌ అయితే, ఏకంగా టాయిలెట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్‌ తయారు చేసి కస్టమర్లకు అమ్మింది. ఇలా దాదాపు 30 ఏళ్లు చేసింది. రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు విషయం తెలిసి షాక్‌ తిన్నారు. వెంటనే దాన్ని సీల్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియా, జడ్డా సిటీ మున్సిపాలిటీ అధికారులు తాజాగా సిటీలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఓ 30 ఏళ్ల పాత రెస్టారెంట్‌ని తనిఖీ చేశారు. ఆ రెస్టారెంట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్‌ టాయిలెట్లో తయారు చేస్తుండటం చూసి షాక్‌ అయ్యారు. గత 30 ఏళ్ల నుంచి టాయిలెట్‌లోనే భోజనాలు ​కూడా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆహారం తయారు చేయటానికి ఎక్స్‌పైర్‌ అయిన వంట పదార్ధాలను వాడుతున్నట్లు కనుగొన్నారు. మాంసం, చీజ్‌ వంటివి ఎక్స్‌ఫైర్‌ అయి రెండు సంవత్సరాలు అయినా వాటిని కూడా వాడుతున్నట్లు గుర్తించారు. అక్కడ క్రిమి,కీటకాలు సైతం విచ్చలవిడిగా తిరగుతుండటంతో అధికారులు రెస్టారెంట్‌ను సీల్‌ చేశారు.Foodtestఅపరి శుభ్రత, సరైన ఆహార ప్రమాణాలు పాటించని కారణంగా సౌదీలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. జనవరి నెలలో జెడ్డాలోని ప్రముఖ రెస్టారెంట్‌ శావర్మ సైతం అపరి శుభ్రత కారణంగా మూతపడింది. ఓ ఎలుక కస్టమర్ల కోసం తయారు చేసిన మాంసాన్ని తింటూ ఉండటం చూసిన అధికారులు రెస్టారెంట్‌ను సీల్‌ చేశారు. మరి, 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసాల తయారీ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : చేపల కోసం నదిలోకి వెళ్తే లక్షల విలువ చేసే నిధి దొరికింది! ఎలా అంటే..

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.