ఊరి చివర బావిలో పసిపాప శవం, ఆరా తీస్తే 14 ఏళ్ల బాలికపై 9 నెలలు

మధ్యప్రదేశ్- ఈ కాలంలో అవాంచిత గర్భాన్ని దాల్చడం, అబార్షన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పుట్టిన బిడ్డను ఎక్కడో చెత్తు కుప్పల్లో పారేయడం సర్వ సాధారనంగా మారిపోయింది. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్బాల్లో ఆ పసిగుడ్డును కన్న తల్లి ఎవరో తెలియక, వారిని ప్రభుత్వ షెల్టర్స్ లేదంటే అనాధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి ఘటన కలకలం రేపుతోంది.

గ్రామం చివరలో హనుమాన్ దేవాలయం దగ్గర ఉన్న పాడుబట్ట బావిలో ఓ పసిబిడ్డ మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఎరో గుర్తు తెలియని వాళ్లు అప్పుడే పుట్టిన పాపను బావిలో పడేసినట్లు తేలింది. పసిపాప ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్ మార్టమ్ నివేధికలో స్పష్టమైంది. ఈ కేసును విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి.

Minor Girl 2

మధ్యప్రదేశ్‌లోని కద్వయ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఊరి చివర బావిలో పసికందు బయటపడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. స్థానికులు బావిలో ఉన్న పసిగుడ్డు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు దర్యాప్తు మొదలుపెట్టారు. అదే గ్రామానికి ఓ 14 ఏళ్ల బాలికే ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చిన్నతనంలోనే తాను తల్లిని కోల్పోయినట్లు ఆ మైనర్ బాలిక చెప్పింది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌లో తన తండ్రి పొలం పనులకు వెళ్లినపుడు, తానుక్కొతే ఇంట్లో ఉన్న సమయంలో తమ బంధువైన 21 ఏళ్ల చోటు విశ్వకర్మ తన ఇంటికొచ్చి అత్యాచారం చేసినట్లు చెప్పింది. అక్కడితో ఆగకుండా అతడి స్నేహితుడు కూడా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత కూడా తనను బెదిరించి అతని మరో ఇద్దరు స్నేహితులు కూడా అత్యాచారం చేశారని చెప్పుకుని ఏడ్చింది. ఇలా మొత్తం 9 నెలల పాటు తనపై వాళ్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది.

ఈ క్రమంలో తాను గర్భం దాల్చానని, ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేధన వ్యక్తం చేసింది. తమకు ఓ బిడ్డ పుట్టగా, ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో పాప పుట్టిన వెంటనే బావిలో పడేసిట్లు ఆ బాలిక చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయిపై అఘ్యాయిత్యానికి పాల్పడిన నలుగురిపై పోస్కో చట్ట ప్రకారం కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. ఆ పాపను రెస్క్యూ సెంటర్ కు తరలించారు.