బిజినెస్ డెస్క్- మీ దగ్గర పాత సైకిల్ ఉందా.. ఐతే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. ఇకపై మీరు సైకిల్ తొక్కాల్సిన పని లేదు. ఎంచక్కా ఈ-బైక్ పై వెళ్లొచ్చు. అవును ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ గోజీరో మొబిలిటి సంక్రాంతి సందర్బంగా సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. కస్టమర్ల కోసం ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకువచ్చింది. స్విచ్ పేరుతో ఈ ఆఫర్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.
ఈ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు వారి పాత సైకిల్ ఇచ్చేసి, కొత్త ఈ-బైక్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. 7 వేల నుంచి 25 వేల వరకు ధరలో ఉన్న ఏ బ్రాండ్ కు చెందిన సైకిళ్లను అయినా ఎక్స్చంజ్ ఆఫర్ కింద తీసుకుంటోంది గోజీరో మొబిలిటీ. మీ ఇంట్లో ఏ బ్రాండ్ కు చెందిన పాత సైకిల్ ఉన్నా దాన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ లో కొత్త దానితో మార్చుకోవచ్చు.
సంక్రాంతి పండగ సందర్బంగా ఈ స్కీమ్ జనవరి 10న మొదలైంది. ఏప్రిల్ 9 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే 3 నెలలు ఈ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. గోజీరో కంపెనీ ఈ కొత్త ఆఫర్ కోసం పలు రకాల సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వన్, సారధి ట్రేడర్స్, గ్రీవ్స్ ఈవీ ఆటోమార్ట్, అరేంద్ర మొబిలిటీ వంటి కంపెనీలో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా కస్టమర్లు వారి పాత సైకిల్‌ను సులభంగానే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. గోజీరో మొబిలిటీ సంస్థ ఎక్స్ సిరీస్ ఇబైక్స్ ధర 34,999 నుంచి 45,999 వరకు ఉంది. ఇది రెగ్యులర్, ఆఫ్ రోడ్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ కంపెనీ 2019 మార్చి నెలలోనే ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వన్, మైల్ పేరుతో రెండు ఇబైక్స్‌ను తీసుకువచ్చింది. వీటి ధర32,999గా, 29,999గా ఉంది. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీ పాత సైకిల్ ఎక్సేంజ్ ఆఫర్ లో ఇచ్చి కొత్త ఈ-బైక్ ఇంటికి తెచ్చుకొండి.