భర్త కూలి పని చేస్తాడని దూరం పెట్టి.. పోలీస్ ఆఫీసర్ కి దగ్గరైంది!

crime

వివాహేతర సంబంధం.. ఇదే భార్యాభర్తల అన్యొన్య జీవితాన్ని నాశనం చేస్తూ హత్యలు, ఆత్మహత్యల వరకు తీసుకెళ్తుంది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాల్లో కాలు పెడుతూ ఎటు కాకుండా పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి కథలోకి వెళ్తే గనుక.. వెంకటేష్, రాజేశ్వరి ఇద్దరు భార్యాభర్తలు. శిడ్లఘట్ట ప్రాంతంలోని మారమ్మ దేవాలయం సర్కిల్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు.

భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే భార్య రాజేశ్వరి కొత్త కుంపటికి దారులు వెతుకుతూ స్థానికంగా ఉండే అనంత్ కుమార్ అనే హెడ్ కానిస్టుబుల్ తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త కూలీ పని చేస్తుడంతో భార్య రాజేశ్వరి కాస్త అవమానకరంగా భావించింది. ఈ కారణంతోనే భార్య కానిస్టేబుల్ తో పరిచయం పెంచుకుంది. సమయం దొరికినప్పుడల్లా అతనితో మాట్లాడడం, తిరగడం చేస్తూ ఉండేదట.

అయితే వీరి తెర వెనుక కాపురం నాలుగేళ్లుగా ఘనంగా సాగుతూ వస్తుంది. ఈ విషయం భర్తకు కూడా తెలియటంతో పలుమార్లు హెచ్చరించినా వినకుండా అదే దారిలో వెళ్లింది భార్య రాజేశ్వరి. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన రాజేశ్వరీ- అనంతకుమార్ మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక ఇంతలోనే ఉన్నట్టుండి భార్య రాజేశ్వరీ ఇంట్లో ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మరణించింది.

ఇక అనుమానం వచ్చిన భర్త వెంకటేష్ నా భార్య మరణానికి కారణం ఆ హెడ్ కానిస్టేబుల్ అనంతకుమారే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు అనంతకుమార్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానింకగా తీవ్ర కలకలంగా మారింది. ఇక భర్త మాట వినకుండా భార్య రాజేశ్వరీ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.