కుప్పంలో విషాదం: కుటుంబాన్ని అలా చూడలేక యువతి ఆత్మహత్య!

priya

ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు ప్రియా. చదువుల్లో సరస్వతిలా పేరు తెచ్చుకుని అందరి చేతా శభాష్ అనిపించుకుంటుంది. మొక్కవోని ధైర్యంతో ఉద్యోగం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష డిఎస్సీలోనూ క్వాలిఫై అయి ఉద్యోగం సాధిస్తాననే గట్టి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు కురుసిన భారీ వర్షాలకు వరదల్లో ప్రియ ఇల్లు కొట్టుకుపోయింది. దీంతో కట్టుబట్టలతో ప్రియ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనలను చూసిన ఆ యువతి తట్టుకోలేకపోయి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని ఈ భువి నుంచి వదిలి వెళ్లిపోయింది.

ఇటీవల జరిగిన ఈ హృదయవిదారకమైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుప్పం పరిధిలోని గుడుపల్లి గ్రామానికి చెందిన జానకిరామ్, నాగలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు ప్రియ(24), చిన్న కూతురు ఝాన్సీ. ఇక ప్రియ విషయానికొస్తే చదువుల్లో ఆరితేరి మంచి పేరును సంపాదించుకుంది. అటు స్కూల్ లైఫ్ నుంచి ఇటు డిగ్రీ వరకు చదువుల్లో మొదటి స్థానంలో ఉంటూ ఉద్యోగం కోసం కష్టపడి చదివింది. ఇక ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తి చేసి డీఎస్సీలోనూ సైతం క్వాలీఫై అయింది.

ఇక గతంలో నిర్వహించిన ఆర్ఆర్బీ పరీక్షల్లోనూ తన ప్రతిభను చూపించి ఒకే ఒక్క మార్కుతో ఉద్యోగం కోల్పోయింది. అయినా ప్రియ ఎక్కడ కూడా నిరుత్సాహ పడలేదు. అలా ఉద్యోగం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తరుణంలోనే వరుస వరదలు ఏపీని చుట్టిముట్టాయి. ఈ వరదల్లో ప్రియ ఇల్లు కొట్టుకుపోయింది. ఇక దాతలు ఇచ్చిన ఇంట్లో ఉంటూ వరదల దాటికి తన కుటుంబానికి జరిగిన ఘోరాన్ని చూసి ప్రియ తట్టుకోలేకపోయింది.

ఏ చేయాలో అర్థం కాక గత ఆదివారం స్థానిక రైల్వే ట్రాక్ పై ప్రియ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక ప్రియ ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకెళ్తూ ముంచెత్తిన వరదల దాటికి జరిగిన ఘోరాన్ని తట్టుకోలేకపోవడంతో ప్రియ ఆత్మహత్య చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.