దేవుడు చెప్పాడని కన్నకొడుకుపై కన్నతల్లి దాష్టికం!

దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపాడని అంటారు. బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కన్నబిడ్డని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన మాతృమూర్తి మృగంగా మారింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్‌.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ కొడుకు శ్రీనివాస్‌(4)ను వేట కొడవలితో నరికి చంపింది.

ఇది చదవండి : అక్కా బావతో కలిసి బాలయ్య బాబు సంక్రాంతి సంబరాలు

వివరాల్లోకి వెళితే మైసూరు జిల్లా హెచ్‌.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. వీరికి శ్రీనివాస్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉన్నాడు. గత కొన్ని రోజలుగు భవాని తనకు దేవుడు కనిపిస్తున్నాడని.. తనతో మాట్లాడుతున్నాడని చెబుతూ వస్తుంది. ఆమె మానసిక పరిస్థితి భరించలేక భర్త వేరుగా ఉంటున్నాడు. కొడుకు శ్రీనివాస్ తో భవాని వేరే ఇంట్లో ఉంటుంది.

ఇది చదవండి : వెస్ట్ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు

ఈ నేపథ్యంలోనే ఇటీవల దేవుడు పూనాడాని చెప్పి ఎవరికి తెలియకుండా కొడుకును అతి కిరాతకంగా కొడవలితో గొంతుకోసి హతమార్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. కొన్న కొడుకునే కఠినంగా చంపిన ఆ తల్లిపై ఫైర్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలున్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌.డి.కోటె పోలీసులు భవానీని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.