విర్రవీగిన కుల వివక్ష.. గుడిలోకి ప్రవేశించిన రెండేళ్ల దళిత బాలుడిపై..!

dalith people attack

కాలాలు మరుతున్నా మనిషి ప్రవర్తనలో మాత్రం అస్సలు మార్పు రావటంం లేదు. నేటి ఆధునిక యుగంలో కూడా కులాల గజ్జితో కొందరు వెంపర్లాడుతూ దళితులను సామాజికంగా హింసిస్తున్నారు. అగ్రకులాల ఆధిపత్యం బుసలు కొడుతూ దళితులను మానసిక క్షోబకు గురిచేయటమే కాకుండా దళితులను సమాజంలో దూరంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇక తాజాగా కర్ణాటకలోని కొప్పాల్‌ జిల్లాలో మియాపూర్‌ గ్రామంలో ఈ నెల 4న జరిగిన దారుణ ఘటనతో సభ్య సమాజం ముందు తలదించుకునేలా చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌లో చెన్నదాసరి కులానికి చెందిన రెండేళ్ల బాలుడి పుట్టిన రోజు కావటంతో తల్లిదండ్రులు ఆంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్లారు. ఇక అక్కడే ఉన్న ఆలయ పూజారులు అలెర్ట్ అయి అక్కడి దళిత కుటుంబాన్ని నిందించారు.

dalith people attackఇక ఇంతటితో ఆగకుండా గ్రామంలోని పెద్దల సమక్షంలో ఆ దళిత కుటుంబానికి ఆలయం మైలపడిందని రూ.23 వేల జరిమానా విధించారు. ఇక రంగంలోకి దిగిన సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాలచంద్ర సంగనాల్‌ ఆధ్వర్యంలో జరిమానా విధించిన నలుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.