బిగ్ బ్రేకింగ్ : అచ్చెంనాయుడికి ప్రమాదం..

స్వాతంత్య్ర సమరయోధుడు సర్ధార్​ గౌతు లచ్చన్న ప్రత్యేక తపాల కవర్‌ రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన మనవరాలు శిరీష తెలిపిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకొని.. సర్ధార్​ గౌతు లచ్చన్న పోస్టల్ స్టాంపును ఇప్పటికే విడుదల చేశారని శిరీష గుర్తు చేశారు.

dasgag minతాజాగా శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టరు ఆవిష్కరణలో అపశ్రుతి జరిగింది. సభలో వేసిన సోఫాలో కూర్చునే సమయంలో ఎంపీ రాంమోహన్ నాయుడు, టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక్కసారే అదుపు తప్పి వెనక్కి పడిపోయి ప్రమాదం జరిగింది. బాబాయ్‌ అబ్బాయిలిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెనకాల ఉన్న సోఫా దూరంగా ఉండడంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడ ఉన్న వారు అలర్ట్ అయి ఇద్దరిని పైకి లేపారు. ఆ తర్వాత యధావిధిగా పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగింది.

asfdgs minఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ముందు డయాస్ పై ప్రతి ఒక్కటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.. అలాంటిది నిర్వాహకులు సోఫా విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం వహించడంపై అక్కడే ఉన్న టీడీపీ నేతలు, కార్యక్తలు ఫైర్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా తమ అభిమాన నాయకులకు ఏలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు టీడీపీ నేతలు.