telangana mini municipal election results
హైదరాబాద్- తెలంగాణలో మినీ మునిసిపోల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటు నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేటలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ, మరో నాలుగు మున్సిపాలిటీల్లోని నాలుగు వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపునకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 1, 2 తేదీల్లో పరీక్షలు చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు.
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రోజు సాయంత్రంలోగా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఫలితాలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.