రెండవ పెళ్లికి రెడీ అంటున్న చిరంజీవి సర్జా భార్య‌.. షాక్ లో అభిమానులు..!

Meghana Raj and chiranjeevi

గత కొన్ని రోజల నుంచి దక్షిణాది మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. క‌న్న‌డ న‌టుడు చిరంజీవి స‌ర్జా భార్య గురుంచి. స్వయానా హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా. కన్నడ చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు.

Meghana Raj and chiranjeeviఇలా సినిమాలు చేస్తున్న క్రమంలో కన్నడ, మలయాళ చిత్ర సీమలో అగ్రకథానాయికగా పేరు పొందిన నటి మేఘన రాజ్‌ తో చిరంజీవి సర్జాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు నచ్చుకోవటంతో పరిచయం కాస్త పెళ్లి వరకూ వెళ్లింది. ఇక పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్న క్రమంలో చిరంజీవి సర్జా గతేడాది గుండెపోటుతో కన్నుమూశాడు. దీంతో అప్పటి నుంచి మేఘన రాజ్‌ ఒంటరిదైంది. ఇక ఈ నేపథ్యంలోనే కన్నడ ‘బిగ్‌బాస్‌ 4’ విన్నర్‌ ప్రథమ్‌ను పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. మరీ దీనిపై నటి మేఘన రాజ్‌ ఇంత వరకూ స్పందించలేదు. దీంతో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.