సమంతా మరోసారి ఆలోచించుకో.. విడాకులు ఆపడానికి రంగంలోకి వెంకటేశ్!

venkatesh

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ గా పేరుగాంచిన సమంత-నాగచైతన్య చివరికి విడాకులు తీసుకోక తప్పలేదని, అభిమానులు అర్ధం చేసుకోవాలంటూ అధికారికంగా తెలిపారు. దీంతో వీళ్లిద్దరి ఫ్యాన్స్ ఏం జరుగుతుందో తెలియక అంతా షాక్ లో మునిగిపోయారు. ఇక వీరి విడాకుల అంశంపై టాలీవుడ్ లో ఇటు నాగార్జున నుంచి అటు సినీ ఆర్టిస్టుల వరకు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ ఇన్ స్టా గ్రామ్ లో మంగళవారం ఓ పోస్ట్ పెట్టాడు. ఇది ఖచ్చితంగా సామ్-చైతు విడాకులు అంశం గురుంచేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

venkatesh insta storyఇదిలా ఉండగా తాజాగా మరోసారి తన ఇన్ స్టా గ్రామ్ లో మరో పోస్ట్ పెట్టాడు వెంకటేష్. మనసు అనేది అనేకమైన ఆలోచనలు కలిగిన పుట్ట.. మనం వెళ్లే మార్గాన్ని జాగ‍్రత్తగా ఎంచుకోవాలి’ అంటూ అర్థం వచ్చేలా వెంకటేష్ పోస్ట్ పెట్టాడు. ఇక చైతు-సామ్ ను ఉద్దేశించే వెంకీమామ పోస్ట్ పెట్టాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే విక్టరి వెంకటేష్ వీరిద్దరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టాడని మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.