తెలుగులో దుమ్ము లేపుతున్న RRR ట్రైలర్.. మరి హిందీలో?

Bollywood Reaction on RRR Trailer - Suman TV

RRR.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ అభిమానులను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ గురువారం ఉదయం 10 గంటలకి థియేటర్స్ లో విడుదలైన ట్రైలర్ కి విశేష ఆదరణ లభిస్తోంది. దీంతో.. మూవీ యూనిట్ 11 గంటలకే ట్రైలర్ ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది.

అంతా ఊహించినట్టే తెలుగునాట ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ టాప్ లేపేసింది. అటు మెగా ఫ్యాన్స్ ని, ఇటు నందమూరు అభిమానులను ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. నిజానికి తెలుగులో ఈ ట్రైలర్ కి ఇంత రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరమైన విషయమేమి కాదు. కానీ.., బాలీవుడ్ లోనే ట్రిపుల్ ఆర్ ట్రైలర్ కి అనుకోని రియాక్షన్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బాహుబలితోనే తెలుగు సినిమాలకి హిందీలో కూడా మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఆ చిత్రం ఇచ్చిన నమ్మకంతోనే.. జక్కన్న ట్రిపుల్ ఆర్ ని కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాడు. అయితే.., బాహుబలి కనెక్ట్ అయినంతగా హిందీ ప్రేక్షకులకి ఆర్.ఆర్.ఆర్ కనెక్ట్ అవుతుందా? లేదా? అన్న చిన్న మీమాంస అందరిలో ఉండింది. కానీ.., ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ఆ అనుమానాలను పటాపంచలు చేసేసింది. హిందీలో ట్రిపుల్ ఆర్ ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది. థియేటర్స్ లో ట్రైలర్ ప్లే అయిన క్షణం నుండే బాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. బాహుబలిని మించిన మరో బొమ్మ రాజమౌళి నుండి రాబోతుంది అంటూ.. నార్త్ పీపుల్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అన్నిటికి మించి ట్రిపుల్ ఆర్ హిందీ వెర్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో కూడా రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుండటం విశేషం.

సినిమాలో ఏదైనా స్పార్క్ కనిపిస్తే బాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు. దీనికి బాహుబలి ఫ్రాంచైజీనే సరైన ఉదాహరణ. ముఖ్యంగా బాహుబలి-1 నచ్చడంతో, బాహుబలి-2 కి హిందీ ఫ్యాన్స్ ఏ రేంజ్ కలెక్షన్స్ కురిపించారో అందరికీ తెలుసు. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ కే హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి.. ట్రిపుల్ ఆర్ బాలీవుడ్ బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. మరి.. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.