జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండిటిని మ్యానేజ్ చేసుకుంటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇక వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారాడు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే స్థానం మినహా కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓటమిని చవి చూసి నాలుక్కరుచుకున్నాడు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గతంలో కన్న కాస్త భిన్నంగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా గత ఎన్నికల్లో జనసేన పార్టీకి మీడియా నుంచి ఎటువంటి కవరేజ్ లేకపోవటంతో అభ్యర్ధుల గెలుపుకు కొంత మైనస్ గా మారిందని పార్టీ నేతలు చర్చించుకున్నారట. దీంతో రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఓ మీడియా ప్లాట్ ఫామ్ ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఆలోచించినట్లు సమచారం. ఇందులో భాగాంగనే రామ్ చరణ్ బాబాయ్ కోసం ఓ ప్రముఖ ఛానెల్ కొనుగోలుకు ఢీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి ఆ ఛానెల్ ఎండీ కూడా అంగీకరించాడంటూ వార్తలు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలపై స్పందిచాడు ఆ ఛానెల్ ఎండీ. మా ఛానెల్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ పూకార్లే అంటూ వస్తున్న వార్తలను కొట్టిపడేశాడు. నా వద్దకు రామ్ చరణ్ కానీ మరెవరు కానీ సంప్రదించలేదని, అసలు మా ఛానెల్ కొనుగోలులో ఎటువంటి ఢీల్ కుదుర్చుకోలేదంటూ ఎండీ పూర్తి క్లారిటీ ఇచ్చాడు.