ప్రభాస్, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ కి ఊరికే కోట్ల రూపాయిలు ఇవ్వరు! పవన్ సంచలన కామెంట్స్!

pawankalyan republic tollywood

దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. శనివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు తీస్తే ఇక్కడ ప్రభుత్వ పెత్తనం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులు కోట్లు తీసుకుంటారని అంటున్నారని, కానీ ప్రభాస్ లా కండలు పెంచితేనో, జూనియర్ ఎన్టీఆర్ ల డ్యాన్స్ లు చేస్తే తప్ప అన్ని కోట్లు ఇవ్వరని పవన్ అన్నాడు. ఇలా తీసుకున్న మొత్తం ట్యాక్స్ పోను వారికి చేతకొచ్చిన డబ్బుతో సినిమా వ్యవస్థను నడుపుకోవాల్సి వస్తుందని పవన్ వివరించారు. ఇక నా సినిమాలపై కోపంతో ఇతర నటుల పొట్ట కొట్టొద్దని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.