లైగర్ మూవీలో మైక్ టైసన్.. విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

Liger Vijay Devarakonda with IRON MIKE TYSON - Suman TV

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘లైగర్‌’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి విజయ్‌ దేవరకొండ సంచలన ప్రకటన చేశారు. ఈ సినిమాలో బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. బాక్సింగ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైసన్‌ తొలిసారి ఒక ఇండియన్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే లైగర్‌పై భారీ అంచనాలు ఉండగా మైక్‌ టైసన్‌ కూడా యాడ్‌ అవ్వడంతో ఈ సినిమాపై అంచానా తారా స్థాయికి చేరాయి. పాన్‌ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను కరన్‌జోహర్‌, పూరీ జగన్నాథ్‌ సంయుక్తంగా ప్రోడ్యూస్‌ చేస్తున్నారు.