నెటిజన్లకు అడ్డంగా బుక్కయిన లోబో!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి.. వస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ షో కి మన దేశంలో కూడా మంచి క్రేజ్ లభించింది. మొదట బిగ్ బాస్ షో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ కి ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. తెలుగు మొదటి సారిగా బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు.. అప్పట్లో ఈ షోకి భలే క్రేజ్ వచ్చింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 3,4 కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరించారు.

lobo1 compressedఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ప్రారంభ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  కంటెస్టెంట్‌ల డ్యాన్స్‌లు, వారి ప్రమోలతో సందడిగా మారింది. ఈ సారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తొలి రోజే బిగ్‌బాస్‌ తనదైన టాస్క్‌లతో హౌజ్‌ సభ్యులను ఉరుకులు పరుగులు పెట్టించారు. అయితే బిగ్ బాస్ షో పై ఎంతగా ప్రశంసలు వచ్చాయో.. అంతగా విమర్శలు కూడా వచ్చాయి. కొంత మంది సెలబ్రెటీలు సైతం బిగ్ బాస్ పై తమదైన వ్యంగాస్త్రాలు సంధించారు. అలాంటి వారిలో కమెడియన్ లోబో ఒకరు.

lobo compressedమా టీవీ ద్వారానే కెరీర్‌ ప్రారంభించిన లోబో ఇప్పుడు అదే చానల్‌ నిర్వహిస్తోన్న షోలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. అంతా బాగుంది కానీ.. ఇప్పుడు బిగ్‌బాస్‌ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించిన లోబో.. గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. లోబో గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ‘బిగ్‌బాస్‌ షో గురించి మీ అభిప్రాయం ఏంటి.?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘బిగ్‌బాస్‌కు ఓ దండంరా అయ్యా. అది నా టేస్ట్‌ కాదు.. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం నాకు రాకపోవమే మంచిది. నాకు ఆ షో నచ్చదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరి అప్పుడు అంత భారీ డైలాగ్స్ కొట్టి ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చావేంటి బయ్యో.. అంటూ నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారను. లోబో నాడు చెప్పిన మాటలను నేడు ట్రోల్ చేసి పడేస్తున్నారు.