రష్మిక అండర్ వేర్ యాడ్ ని తిడుతున్న నెటిజెన్స్.. అడ్డంగా బుక్ అయిపోయింది

rashmika ad macho

ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యువకుల కలలరాణిగా మారిపోయింది రష్మిక మందన్న. తెలుగు, తమిళ, మళయాళ సినీ ఇండస్ట్రీల్లో కూడా రష్మిక వేవ్ ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ బాలీవుడ్ లోనూ మెరవాలన్న ప్రయత్నాల్లో ఉంది. మరి.. ఇన్ని అవకాశాలు చేతిలో ఉంటే.. ఈ అమ్మడికి కార్పొరేట్ యాడ్స్ చేసే అవకాశం రాకుండా ఎలా ఉంటుంది? రశ్మిక ప్రస్తుతం ఇలాంటి యాడ్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ అండర్ వేర్ యాడ్ ఇప్పుడు రష్మిక మందన్న పరువు తీసేసింది.

ఈ మధ్య కాలంలో కార్పొరేట్ యాడ్స్ లో కూడా క్రియేటివ్ లెవల్స్ ఓవర్ అయిపోతున్నాయి. రష్మిక అండర్ వేర్ యాడ్ కూడా ఈ కోవకే చెందుతుంది. ఈ యాడ్ లో రష్మిక ఓ ఫిట్ నెస్ ట్రైనర్ గా కనిపించింది. ట్రైనింగ్ కి వచ్చిన వారిలో ఓ వ్యక్తి ప్రముఖ బ్రాండెడ్ ఇన్నర్ వేర్ వేసుకొచ్చి ఉంటాడు. అతని ఇన్నర్ వేర్ చూడగానే రష్మిక అందరిని అదే భంగిమలో ఉంచేస్తుంది. ఆ విషయాన్ని అతను కూడా గమనించడంతో మన నేషనల్ క్రష్ మొహంలో నవ్వులు విరబూస్తాయి.

rashmika ad machoదీనికి కొనసాగింపుగా ఇదే ఇన్నర్ వేర్ ది మరో యాడ్ ఉంది. ఆ రోజు ట్రైనింగ్ సెంటర్ లో ఎవ్వరూ ఉండరు. ఆ ప్రముఖ బ్రాండెడ్ ఇన్నర్ వేసుకున్న వ్యక్తి మాత్రం ట్రైనింగ్ సెంటర్ కి వస్తాడు. అతనికి అందకుండా మ్యాట్ పై భాగాన ఉంచుతుంది రష్మిక. మ్యాట్ కోసం అతను చేతులు పైకి ఎత్తగానే మరోసారి ఆ ప్రముఖ బ్రాండెడ్ అండర్ వేర్ రష్మికకి దర్శనం ఇస్తుంది. దీంతో.. మరోసారి మేడమ్ మొహంలో సిగ్గుతో విరబూస్తుంది.

ఇప్పుడు ఈ యాడ్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే యాడ్ లో గనుక అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి, అబ్బాయి ప్లేస్ లో అమ్మాయి ఉండుంటే ఫిమినిస్ట్ లు ఈ పాటికి రచ్చ రచ్చ చేసేవారు కదా అంటూ పురుష సమాజం కాస్త ఘాటుగానే స్పందిస్తోంది. అయినా.. నేషనల్ క్రష్ స్థాయిలో ఉన్న రష్మిక ఇలాంటి యాడ్ లో నటించడం ఏమిటని ఆమె ఫ్యాన్స్ సైతం నిరాశకి లోనవుతున్నారు. మరి.. ఈ యాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.