మరో ప్రయోగంలో దగ్గుబాటి రానా..!

rana virata parvam

దగ్గుబాటి రానా.. బాహుబలి సినిమాతో తన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఎప్పుడు విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలు చేస్తూ తన రూటే సపరేట్ అంటున్నాడు రానా. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా కథా నాయకుడిగా సాయిపల్లవి కథానాయికగా నటించిన చిత్రం విరాటపర్వం. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపిస్తుండగా నటి ప్రియమణి భారతక్క అనే పాత్రలో కనిపిస్తుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ మూవీపై అంచనాలు మరింత పెంచాయి. విషయం ఏంటంటే..? విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ వస్తున్న రానా మరో ప్రయోగానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరో ప్రయోగమేంటని అనుకుంటున్నారా? ఈ మూవీ దర్శకుడు వేణు ఉడుగుల కోరిక మేరక ఈ చిత్రంలో రానా ఓ పాట పాడనున్నాడట. గంభీరమైన స్వరాన్ని కలిగి ఉన్న రానా పాట పాడనుండటంతో తన అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.