రైతు నిర‌స‌న‌ల‌పై కంగనా రౌనత్ షాకింగ్ కామెంట్స్.. కేసు నమోదు!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నటి కంగనా రౌనత్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. రైతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి చిక్కులు తెచ్చుకుంది. ఈ మద్యే భారత దేశ స్వతంత్రం గురించి ఈమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.

kasrga minసాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్ స్ట్రాగ్రామ్ లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. కంగనా కామెంట్స్ సిక్కుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిక్ మతస్థులు ఆమెపై కేసు నమోదు చేయించారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. పలువురు సిక్ మత పెద్దలు కలిసి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

kasnga minసిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించడంతోపాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చితకబాదినట్లు.. బూట్ల కింద దోమల్లా నలిపివేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికీ అలాంటి గురువు కావాలంటూ రాసుకొచ్చారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అస‌లే ముంబై రాష్ట్ర ప్ర‌భుత్వం కంగ‌నా ర‌నౌత్‌కు వ్య‌తిరేకం.. ఇది వ‌ర‌కే ఆమెకు వ్య‌తిరేకంగా వారు బి.ఎం.సి ద్వారా పెద్ద గొడ‌వే చేశారు. ఇప్పుడు ఈ కంప్లైంట్‌తో వారెలా రియ‌క్ట్ అవుతారో చూడాలి.