గుర్రపు పందెంలో ఆస్తులన్నీ పోయాయంటున్న అనసూయ

ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఈ పేరు పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో తో పాటు, సినిమాల్లోను ప్రత్యేకమైన క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తోంది అను. టీవీ షోలు, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలో అనసూయ బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఇవరైనా శృతి మించి కామెంట్స్ చేస్తే తనదైన స్టైల్లో ధీటిగా సమాధానం చెప్పడం అనసూయకే చెల్లుతుంది. అన్నట్లు అనసూయం మొన్న ఓ ఇంటర్వూలో తన కుటుంబం గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. తన బాల్యంలో తాము అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకుని ఆవేధన చెందింది. తన చిన్నప్పుడు తాము బాగా డబ్బు ఉన్నావాళ్లమేనని చెప్పిన అనసూయ, తమకు గుర్రాలు ఉండేవని, తండ్రి గుర్రపు రేసుల్లో పాల్గొనేవారని చెప్పింది. ఐతే గుర్రపు పందేల జూదంలో తమ ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయని బాధగా చెప్పుకొచ్చింది. తండ్రి గుర్రపు పందేలాతో తమ ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని అనసూయ ఏడ్చినంత పనిచేసింది.

8012 anasuya
Anasuya bhardwaj

ఐతే తన తండ్రి తమను చాలా బాగా పెంచాడని కూడా చెప్పింది. తాము స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తండ్రి మరీ మరీ చెప్పేవారని గుర్తు చేసుకుంది. ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్లను ఎలా హ్యాండిల్‌ చేస్తున్నాం వంటి అంశాలను కూడా ఆయన గమనిస్తూ.. ఎవరితో ఎలా మసలుకోవాలో చెప్పేవారని తెలిపింది అనసూయ. చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోక బస్టాప్‌ వరకు నడుచుకుంటూ వెళ్లాదన్ని చెప్పుకొచ్చింది. ఐతే ఇప్పుడు మాత్రం కష్టాలు తొలగిపోయి అంతా హ్యాపీగా ఉన్నామని.. పిల్లలు, భర్త భరద్వాజ్ తో సంతోషంగా జీనితాన్ని గడుపుతున్నానని చెప్పింది అనసూయ. ఇక అనసూయ తాజాగా నటించిన ధ్యాంక్యూ బ్రదర్ సినిమా ఆహాలో విడుదలైంది. మరో ఆరు సినిమాల్లో నటిస్తోంది అనసూయ.