Viral Video: ఓ తల్లి తన బిడ్డ కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. ప్రాణాలను సైతం లెక్కచేయదు. తన ఎదుట ఎంతటి ప్రమాదం ఉన్నా పట్టించుకోదు. బిడ్డ క్షేమంగా ఉంటే చాలనుకుంటుంది. గతంలో ఓ తల్లి రోడ్డు ప్రమాదానికి గురైంది. వాళ్లు వెళుతున్న బైకును ఓ కారు ఢీకొట్టింది. భర్త పక్కకు పడిపోయాడు. తల్లి, బిడ్డలు ఎదురుగా వస్తున్న కంటైనర్ వ్యాను చక్రాలకు దగ్గరగా పడ్డారు. బిడ్డ దొర్లుకుంటూ చక్రం కిందపడబోయాడు. అది గమనించిన తల్లి బిడ్డను వెంటనే పక్కకు తోసి, తను ఆ స్థానంలోకి వెళ్లింది. అయితే, కంటైనర్ వ్యాను పక్కకు వెళ్లిపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదం మొత్తం సెకన్ల టైంలో జరిగింది. ఇక, తల్లి ప్రేమకు ఉదాహరణగా నిలిచే మరో ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఓ తల్లి పాము బారినుంచి బిడ్డను కాపాడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం ఓ పాము ఇళ్ల మధ్యలోకి వచ్చింది. ఓ ఇంటి ముందున్న మెట్టును ఆనుకుని వెళుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ, తన కుమారుడితో ఇంటి బయటకు వచ్చింది. ఆ పిల్లాడు మెట్టు దిగటానికి కాలు కిందపెట్టాడు. కొంచెం ఉంటే అతడి కాలు పాముపై పడేదే.. కానీ, పాము వెంటనే వెనక్కు వెళ్లింది. ఇది చూసిన మహిళ భయపడిపోయింది.
వెంటనే పిల్లాడి దగ్గరకు వెళ్లింది. ఆ పిల్లాడు ఏం జరుగుతోందో అర్థం కాక వెనక్కు పాము వైపు వెళ్లాడు. పిల్లాడు తన వైపు వస్తున్నాడని గ్రహించిన పాము పడగ విప్పి పైకి లేచింది. కోపంగా బుసకొట్టింది. అడుగు దూరం మాత్రమే ఉంది. సెకన్ల కాలంలో స్పందించిన తల్లి బాలుడ్ని వెనక్కు లాగి పక్కకు తీసుకుపోయింది. పాము తన మానాన అది వెళ్లిపోయింది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రేమించి పెళ్ళాడినా తప్పని వరకట్న వేధింపులు.. గర్భవతి అన్న కనికరం లేకుండా..