'కట్నం అడిగిన వాడు గాడిద' అన్న మాట తెల్లని వాల్కో లేదా ఫేస్బుక్ వాల్కే పరిమితం అవుతుంది తప్ప ఆ రాతలు మనిషి గుండెను తాకడం లేదు. వరకట్నం పేరుతో వివాహితలను వేధిస్తే కఠిన శిక్షలు తప్పవని ఎంత హెచ్చరించినా, ఎన్ని శిక్షలు వేసినా సమాజంలో మార్పు రావడం లేదు. ఇంకా చీడపురుగుల్లా ఆటవిక మనుషులు అక్కడక్కడా ఉంటున్నారు. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను, అండగా ఉంటానని చెప్పి పెళ్ళి చేసుకున్న వారిలో మనుషులు మాయమైపోయి మృగాలు బయటపడుతున్నాయి. కట్నం కోసం కట్టుకున్న భార్యని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా కావేరి అనే యువతి వరకట్న వేధింపులకు గురయ్యింది. కావేరి పేరుకి తగ్గట్టే కళ్ళలో గోదారిని నింపుకుంది. కష్టాల కడలిలో వరకట్న వేధింపులు తాళలేక బోరున విలపించింది. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే పాపమైపోయింది, ఆమె పాలిట శాపమైపోయింది. అందరిలానే ప్రేమించానన్నాడు. నువ్వొచ్చెయ్ నేను చూసుకుంటా అన్నాడు. ఆ మాయ మాటలని నమ్మి అమ్మా, నాన్నలని వదులుకుని మరీ వెళ్ళింది. తీరా వెళ్ళాక అసలు రంగు బయటపెట్టాడు. కట్నం పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. కట్నం తెస్తావా, చస్తావా అంటూ చిత్రహింసలకు గురి చేశాడు. గర్భవతి అన్న కనికరం లేకుండా పాశవికంగా ప్రవర్తించాడు. భర్త వేధింపులకు అత్త కూడా తోడయ్యింది. అత్తా, భర్త ఇద్దరూ కలిసి ఆమెను ఇంట్లోంచి పొమ్మన్నారు. కట్నం తెస్తే రా, లేదంటే మర్చిపో అన్నారు. ఉత్త చేతులతో ఇంటికొస్తే మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తామని బెదిరిస్తున్నారు. విడాకులు ఇస్తామని అంటున్నారు. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో కావేరి న్యాయం కోసం సుమన్ టీవీ గడప తొక్కింది. మరి ఆమెకు న్యాయం జరిగేలా ఈమె సమస్యని అందరికీ షేర్ చేయండి. అలానే కట్నం కోసం వేధిస్తున్న కావేరి భర్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ కు వేధింపులు! ఇది కూడా చదవండి: ఆటో డ్రైవర్ ప్రేమలో స్టేట్ టాప్ ర్యాంకర్! ఆరోజు రాత్రి..!