ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు అన్నది పాత నానుడి. ఇల్లు కట్టిచూడు.. బారాత్ పెట్టి చూడు అన్నది కొత్త నానుడి. అవునండి బాబు.. పెళ్లికి మించి డెకరేషన్లు, బారాత్‌లకే ఈ మధ్య ఇంపార్టెన్సు పెరిగిపోయింది. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ఇప్పుడు బరాత్, డీజే, స్టెప్పులు కామనైపోయాయి. వీటికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా అతీతులేం కాదులెండి. తాజాగా అలా కాలు కదిపిన కేంద్రమంత్రి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరలవుతోంది.
హుహ్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆయన కుమార్తె వివాహం చాలా గ్రాండ్‌గా చేశారు. అందులో ఏర్పాటు చేసిన డాన్స్ కార్యక్రమంలో మంత్రి కూడా పాల్గొన్నారు. ఆయన సతీమణి జ్యోతితో కలిసి హుషారుగా స్పెప్పులేశారు. తెలుగులో బాగా పాపులర్ సాంగ్ ఎన్నెన్నో జన్మల బంధం పాటకు కన్నడ వర్షన్ ‘ఎందెందు నిన్నాను మారేటు నానిరాలారే’ పాటకు డాన్సు చేశారు. ఆయన సతీమణి జ్యోతి చేయి పట్టుకుని అతిథులను అలరించిన కేంద్రమంత్రి డాన్సు వీడియో వైరలవుతోంది.