ఈ మద్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని షాకింగ్ కు గురిచేసేలా కొన్ని నవ్వులు పూయిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎమోషనల్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలు అనేకం నెట్టింట హల్ చల్ చేశారు. ఓ ఒరాంగుటాన్ ముడూ పులి పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటుంది.. అంతేకాదు వాటికి పాలు కూడా పడుతుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది.
సాధారణంగా పక్షులు, జంతువులు మాట్లాడలేక పోవచ్చు.. కానీ తల్లిప్రేమ పంచడంలో మనుషులకు ఏమాత్రం తక్కువ కాదు. తమ పిల్లకు తల్లి ప్రేమను పంచుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. తమ పిల్ల జోలికి ఇతర జంతువులు వస్తే ప్రాణాలకు తెగించి వాటితో పోరాడుతుంటాయి. కొన్నిసార్లు జంతువులు జాతి వైరం మరచి పిల్లకు పాలు ఇవ్వడం లాంటివి వీడియోలు ఎన్నో చూశాం. ఓ చింపాంజీ మూడు పులి పిల్లలను ఎంతో ముద్దుగా లాలిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చింపాంజీ తన చేతుల్లోకి ముడు పులి పిల్లలను తీసుకొని ఎంతో ముద్దు చేస్తుంది. ఆ చిన్ని కూనలకు కన్న బిడ్డల్లా తన ప్రేమను పంచుతోంది. ఒక పాల బాటిల్ పట్టుకొని బుజ్జి పులి పిల్లలకు పాలు పట్టిస్తుంది. తన భుజాలపై ఎత్తుకొని ముద్దు చేస్తుంది. ఈ అద్భతమైన వీడియో డాక్టర్ సామ్రాట్ గౌడ ఐఎఫ్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. ‘తల్లి ప్రేమ ఎంతో గొప్పది.. అమ్మ ప్రేమ షరతులు లేనిది స్వచ్ఛమైనది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.