యాషెస్ లో భాగంగా లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతి హైలెట్ గా నిలిచింది.
యాషెస్ లో భాగంగా లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు టెస్టు మ్యాచులు ఓడిపోవడంతో ఇంగ్లాండ్ భారీ మార్పులతో బరిలోకి దిగింది. అండర్సన్, టంగ్ స్థానాల్లో క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ని తుది జట్టులోకి తీసుకొచ్చారు. గాయపడిన పోప్ స్థానంలో ఆల్ రౌండర్ మొయిన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆసీస్ కూడా గాయపడిన లియాన్ స్థానంలో మర్ఫీ ని తీసుకొని రాగా.. రెండో టెస్టులో ఫెయిల్ అయిన హాజల్ వుడ్ స్థానంలో బోలాండ్ ని తీసుకొని వచ్చింది. ఆల్ రౌండర్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్ కి చోటు దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి వచ్చిన ఆసీస్ ప్రస్తుతం లంచ్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. అయితే ఈ సెషన్ లో బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతి హైలెట్ గా నిలిచింది.
ఇంగ్లాండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ ఎక్స్ ప్రెస్ బౌలింగ్ వేస్తూ బ్యాటర్లకు సవాలుగా మారతాడు. గంటకు 145 కిలోమీటరల్ వేగం తగ్గకుండా వేసే కొన్ని బంతులకైతే బ్యాటర్ల మైండ్ బ్లాంక్ అవుతుంది. సరిగ్గా అలాంటి స్టన్నింగ్ డెలివరీ మొదటి సెషన్ లో చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 13 ఓవర్ చివరి బంతిని మార్క్ వుడ్ ఏకంగా 152 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఇక ఈ బంతికి ఆసీస్ ఓపెనర్ ఖవాజా దగ్గర సమాధానం లేకుండా పోయింది. రెప్ప పాటులో క్లీన్ బౌల్డయ్యాడు. లెగ్ స్టంప్ ఎగిరి రెండడుగుల దూరంలో పడింది. దీంతో షాక్ లోకి వెళ్లిన ఓపెనర్ ఖవాజాకి కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆండర్సన్ స్థానంలో జట్టులోకి వచ్చి అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఖవాజా వికెట్ తీసి ఆసీస్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి బంతికే బౌండరీ కొట్టి మంచి టచ్ మీద కనిపించిన వార్నర్ అదే ఓవర్లో స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత లబుషేన్, ఖవాజా ఒక చిన్న భాగస్వామ్యం నెలకొల్పినా మార్క్ వుడ్ ఎక్స్ ప్రెస్ పేస్ తో ఖ్వాజాను బౌల్డ్ చేసాడు. ఆ కాసేపటికి 100 టెస్టు ఆడుతున్న స్టీవ్ స్మిత్(22), లబుషేన్(21) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బ్యాటర్లను ఇంగ్లాండ్ బౌలర్లు ఎక్కడా కుదురుకోనివ్వలేదు. ప్రస్తుతం హెడ్ 10, మిచెల్ మార్ష్ 5 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి మిగిలిన ఆసీస్ బ్యాటర్లు ఏ మాత్రం ప్రతిఘటించగలరో చూడాలి. మొత్తానికి ఖవాజా వికెట్ తీసిన మార్క్ వుడ్ డెలివరీ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
A 94mph Mark Wood rocket cleans up Usman Khawaja! 🚀#ENGvAUS | #Ashes pic.twitter.com/Ji0BdzwmvU
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023