యాషెస్ 2023 లో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటి వరకు ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇప్పుడు వారి ఫ్యామిలీ జోలికి కూడా వస్తున్నారు.
యాషెస్ 2023 లో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి చేష్టలు ఎక్కువైపోతున్నాయి. తమ జట్టు గెలవలేదనే కారణంతో ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అంతే కాదు వీరు చేసే ఓవరాక్షన్ కి హద్దు పొద్దు లేకుండా పోతుంది. బెయిర్ స్టో రనౌట్ వివాదం ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నారు. బెయిర్‌స్టో అవుటైన తర్వాత స్టేడియంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులంతా ఆస్ట్రేలియా టీంను ‘చీటర్స్’ అంటూ పెద్ద ఎత్తున గొడవ చేసారు. అంతకు ముందు కూడా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేశారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అయితే ఏకంగా భుజం పట్టుకొని లాగేయడం షాకింగ్ గా అనిపించింది. ఇక మొదటి టెస్టు సందర్భంగా స్టీవ్ స్మిత్ ని నువ్వు ఏడ్చినట్టు టీవీలో చూసాము అని స్మిత్ ని కామెంట్ చేసారు. అయితే లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో స్మిత్ అందరి నోళ్లు మూయించాడు. ఇదిలా ఉండగా ఇపుడు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అతి హద్దు దాటేసింది.
మొన్నటి వరకు ఆసీస్ ప్లేయర్లను టార్గెట్ చేసిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఇప్పుడు వారి ఫ్యామిలీ జోలికి కూడా వస్తున్నారు. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో స్మిత్ తల్లిని ఇంగ్లాండ్ ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పెట్టారని తెలుస్తుంది. అయితే ఆమె స్మిత్ తల్లి అని వారికి తెలియదంట. ఒక ఆసీస్ ఫ్యాన్ గా భావించి ఆమెను అంతా కలిసి గోల చేశారట. దీంతో తట్టుకోలేని ఆమె స్టీడియం వెళిపోవాల్సి వచ్చింది. ఆదే ఆమె స్మిత్ తాళి అని తెలిస్తే ఆమెను ఇంకెంత వేధించే వారు అని భయపడుతున్నారు. ఇలాంటి విషయాలను దృష్టిలోపెట్టుకుని ఇప్పుడు ఆసీస్ ప్లేయర్లు తమకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కుటుంబ సభ్యులకు భద్రత ఇవ్వాలని వాళ్ళు అడిగారట.
ఇక యాషెస్ లో భాగంగా మూడో టెస్టు నేడు హెడింగ్లే వేదికగా జరగనుంది. తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు మీద సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఈ టెస్టులోనూ గెలిస్తే సిరీస్ దక్కుతుంది. ఇక ఇంగ్లాండ్ ఈ సిరీస్ గెలవాలంటే మిగిలిన మూడు టెస్టులు గెలవడం తప్ప ఏ మార్గం లేదు. ఇక ఈ టెస్టుకు చాలా సంవత్సరాల తర్వాత ఆసీస్.. స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ లేకుండానే బరిలోకి దిగుతుంది. ఇక ఫామ్ లేని కారణంగా ఇంగ్లాండ్ కూడా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ ని పక్కన పెట్టడం విశేషం. మొత్తానికి హెడింగ్లేలో మరో హోరా హోరా పోరు చూడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.