సికింద్రాబాద్- తౌక్తే తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే మరో తుఫాను ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది కాస్త అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి, సోమవారం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను మరింత బలపడి 25 నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా వేస్తోంది. ఈ తుపానుకు యాస్ గా పేరు పెట్టారు. యాస్ తుఫాను ప్రభావం ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక యాస్ తుఫాను ప్రభావం చాలా రంగాలపై పడుతోంది. ప్రధానంగా రైల్వేపై తుఫాను ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. యాస్ తుఫాను నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటన చేసింది. యాస్ తుఫాను నేపధ్యంలో మొత్తం 21 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హౌరా..హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 25, 26, 27.. మూడు రోజుల పాటు రద్దు చేశారు. హైదరాబాద్.. హౌరా ఎక్స్‌ప్రెస్ ను ఈనెల 24, 25, 26న రద్దు చేశారు. ఇక గౌహతి..సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ను 26న మాత్రం రద్దు చేశారు, హౌరా..వాస్కోడిగామ ఎక్స్‌ప్రెస్, వాస్కోడిగామ..హౌరా ఎక్స్‌ప్రెస్ ను 25న రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మైసూర్..హౌరా ఎక్స్‌ప్రెస్ ను 23న, గౌహతి..యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ను 24న రద్దు చేశారు. హౌరా..యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ ను 25న, అగర్తలా..బెంగళూరు, బెంగళూరు..అగర్తలా ఎక్స్‌ప్రెస్ ను 25న రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఖరగ్‌పూర్..విల్లుపురం ఎక్స్‌ప్రెస్ ను 27న, ఎర్నాకుళం..హౌరా ఎక్స్‌ప్రెస్ ను 24న రద్దు చేశారు. ఇక విల్లుపురం..పురాలియా ఎక్స్‌ప్రెస్ ను 26న, విల్లుపురం..ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ను 25న నిడపడం లేదని తెలిపింది. అటు యశ్వంత్‌పూర్..భువనేశ్వర్ రైలును 24న, చెన్నై సెంట్రల్..పూరి రైలును 24న, బెంగళూరు..గౌహతి రైలును 27, 28న రద్దు చేశారు. యశ్వంత్‌పూర్..ముజఫర్‌పూర్ రైలును 26న, న్యూటిన్ సుకియా..బెంగళూరు రైలును 28న క్యాన్సిల్ చేశారు. యశ్వంత్‌పూర్..భగల్‌పూర్ రైలును 29న, యశ్వంత్‌పూర్..కామాఖ్య రైలును 29న రద్దు చేశామరి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులు ఈ షెడ్యూల్ మేరకు ప్రయాణ తేదీలను మార్చుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది.