సికింద్రాబాద్- తౌక్తే తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే మరో తుఫాను ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది కాస్త అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి, సోమవారం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను మరింత బలపడి 25 నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని అంచనా […]