పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్) పోస్టులకు 145 ఖాళీల భర్తీకి అర్హులైన, అనుభవజ్ఞులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానించింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ pnbindia.in లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఇది మొత్తం ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మే 7, 2022లోపు తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి. అధికారిక వెబ్ సైట్ నుండి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
ఎంపిక ప్రక్రియ :
పంజాబ్ నేషనల్ ఎస్ ఒ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ ఉద్యోగాల కోసం ఎంపిక నోటిఫికేషన్‌లో తెలపబడిన విధంగా ఆన్‌లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.