బీహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బీహార్ రాకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. 1996లో బీహార్‌లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి.
పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన స్థానములో సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిగా నియమించాడు. తాజాగా బీహార్ రబ్రీ దేవి కార్యకర్తలపై చేయి చేసుకోవడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
2004-09 సమయంలో లాలూ రైల్వే శాఖా మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన పలు మోసాలకు పాల్పపడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు పలు మోసాలకు పాల్పపడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఈ నేరారోపణ విషయంలో పాట్నాలో ఉన్న ఆయన ఇంటిపై సీబీఐ అధికారులు సోధాలు నిర్వహించారు. ఆయన సతీమణి ఇంటితో సహ పలు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆర్జేడీ నాయకులు విమర్శిస్తున్నారు.
పలు చోట్ల తనిఖీలు ముగించుకొని సీబీఐ తిరిగి వస్తున్న సమయంలో ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అందోళన చేస్తూ అధికారులను చుట్టు ముట్టారు. అదే సమయంలో లూలూ సతీమణి రబ్రి దేవి వచ్చి వారి పని వారు చూసుకున్నారు.. వెళ్లనివ్వడండి అంటూ కార్యకర్తలకు సూచించారు. కానీ కొంత మంది కార్యకర్తలు ఆందోళన చేయడంతో వారిపై చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj
— देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022