సామాన్యుల జీవితంలో సమస్యలకు పరిష్కారం వెతుక్కునే క్రమంలో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. అవి అందరి మన్ననలు పొంది అరుదైన గౌరవం లభిస్తుంది. అయితే ఓ పదమూడు సంవత్సరాల కుర్రాడు పేరు తిలక్ మెహతా.. కొత్త ఆలోచనలను సాకారం చేసే దిశగా దృఢ సంకల్పంతో బిజినెస్లో ఎలా రాణించాలో తిలక్ చేసి చూపించాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.
సాధారణంగా నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే సమస్యల నుండి కొత్త ఆలోచనలు పుట్టుకొస్తుంటాయి. సామాన్యుల జీవితంలో సమస్యలకు పరిష్కారం వెతుక్కునే క్రమంలో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయి. అవి అందరి మన్ననలు పొంది అరుదైన గౌరవం లభిస్తుంది. అయితే ఓ పదమూడు సంవత్సరాల కుర్రాడు పేరు తిలక్ మెహతా.. ఓసారి తన మేనమామ ఇంటికి సరదాగా గడిపేందుకు వెళ్లాడు. తను స్కూల్ విద్యార్థి కావడంతో తనతోపాటు స్కూల్ బ్యాగ్లో తన పుస్తకాలను కూడా వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు బుక్స్ తీసుకోకుండా అలాగే మర్చిపోయి వారి ఇంటికి వచ్చేశాడు.
తిరిగి ఇంటికి వచ్చాక పరీక్షల సమయం దగ్గర పడడంతో బుక్స్ అవసరం తీవ్రంగా ఏర్పడింది. బుక్స్ డెలివరీ కోసం కొన్ని ఏజెన్సీలను వెతికాడు. డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉండడం గమనించాడు. మార్కెట్లో డెలివరీ అవసరాలను తీర్చే సంస్థలు అందరికి అందుబాటులో లేవని తెలుసుకున్నాడు. ఆ ప్రయత్నంలో తన బుక్స్ ఇంటికి తెప్పించుకోలేకపోయాడు.
ఈ సమస్యతో తిలక్ మోహతా మెదడులో ఓ కొత్త ఆలోచన రేపింది. ముంబై డబ్బావాలా ప్రేరణతో నగరంలోని వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని ఒకే రోజు డెలివరీ చేసేలా ఓ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు ‘పేపర్ అండ్ పార్శిల్స్’. తక్కువ ఖర్చుతో కస్టమర్లకు డెలివరీ సర్వీసులను అందించాడు. దీనికి అతని తండ్రి ఆర్థిక సహకారం అందించాడు. డబ్బావాలా సంప్రదాయ పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో డెలివరీలు అందించడం స్టార్ట్ చేశాడు. ఈ బిజినెస్ మెల్లమెల్లగా 2018 నాటికి వివిధ వ్యాపార అవసరాలకు అనుగుణంగా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలను చేర్చడానికి విస్తరించబడింది.
ప్రస్తుతం తిలక్ మెహతా స్థాపించిన ఈ సంస్థ రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. 2021 నాటికి అతని నికర విలువ రూ. 65 కోట్లు ఉండగా, నెలకు రూ. 2 కోట్లతో వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కొత్త ఆలోచనలను సాకారం చేసే దిశగా దృఢ సంకల్పంతో బిజినెస్లో ఎలా రాణించాలో తిలక్ చేసి చూపించాడు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, ప్రత్యేక నైపుణ్యాలతో బిజినెస్ చేసేందుకు వయస్సుతో సంబంధం లేదని తిలక్ నిరూపించాడు. తిలక్ ప్రతిభావంతమైన ఆలోచనలు కలిగి ఉండి తను ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.