ప్రజల కోసం తమ ప్రాణాలను అడ్డుపెట్టి రక్షణ కల్పించే పోలీసులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. పోలీసులపై వరాలు కురిపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీంతో పోలీసులు వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రజలకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు కీలకపాత్ర వహిస్తారు. రాత్రనకా పగలనకా నిత్యం అందుబాటులో ఉంటూ నేరాలను అదుపుచేస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. శత్రువులు ఏ మూల నుంచి విరుచుకుపడతారో తెలియదు. అలువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తుంటారు పోలీసులు. ఇంతటి కృషి చేస్తున్న పోలీసు సేవలను కొనియాడుతూ రాష్ట్ర సీఎం వరాలు కురిపించారు. పోలీసుల సంక్షేమం కోసం పలు సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు. ఆ వివరాలు మీకోసం.
పండుగ రోజుల్లో కూడా విధులు నిర్వహిస్తూ వృత్తిపై వారికి ఉండే అంకిత భావాన్ని చాటిచెప్పే పోలీసులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనందించింది. త్వరలో ఎన్నికలు జరుగనున్న వేళ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరాలు కురిపించారు. పోలీసులకు పోషకాహార భత్యాన్ని రూ. 650 నుంచి రూ. 1000కి పెంచుతున్నట్లు వెల్లడించారు. నెలకు 25 లీటర్ల పెట్రోల్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. రొటేషన్ పద్దతిలో వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రకటించారు. యూనిఫాం అలవెన్స్ లు రూ. 3000ల నుంచి రూ. 5000లకు పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. పోలీసుల కోసం 25 వేల ఇండ్లను నిర్మించి అర్హులైన వారికి అందిస్తామని తెలిపారు. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఇచ్చే అలవెన్స్ రోజుకు రూ. 70 నుంచి రూ. 100కు పెంచుతున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు వరాలు కురిపించారు.