ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ఓ వ్యక్తి చేసిన చర్య స్థానికులను అవాక్కయ్యేలా చేసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరిన అతడి తీరుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాధారణంగా సామాన్యులు తమ తీవ్రమైన సమస్యలను ప్రజాప్రతినిధులను, మంత్రులను, ముఖ్యమంత్రులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. కొందరికి వారిని కలిసి తమ సమస్యను చెప్పుకునే అవకాశం దొరుతుంది. మరికొందరికి మాత్రం ఎన్నో ప్రయత్నలు చేసిన వారిని కలిసే అవకాశం దొరకదు. దీంతో ప్రజాప్రతినిధుల దృష్టిలో పడేందుకు వింత చేష్టాలు చేస్తారు. అచ్చం అలానే ఓ వ్యక్తి.. తన ఏడాది వయస్సున కుమార్తెను సీఎం వేదికపైకి విసిరేశాడు. అతనని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ ప్రాంతానికి చెందిన ముకేశ్ పటేల్, నేహ భార్యాభర్తలు. స్థానికంగా దినసరి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే ఆ బాబు విషయంలో తల్లిదండ్రులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆ చిన్నారికి మూడు నెలల వయసున్నప్పుడు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు గుర్తించి చెప్పారు. అప్పటి నుంచి వైద్యం కోసం స్థోమతకు మించి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా ఆ చిన్నారి సమస్య పూర్తిగా నయం కాలేదు. శస్త్రచికిత్స చేసేందుకు మరో రూ.3.50 లక్షలు కావాలన్నారు. ఆ డబ్బులను ఎలా సమకూర్చుకోవాలో ఆ ముకేశ్ దంపతులకు అర్థం కాలేదు. ఇదే సమయంలో తమ సమస్యను సీఎంకు చెప్పాలని భావించారు.
ఇలా వారు ఆలోచిస్తున్న సమయంలో సాగర్ ప్రాంతంలో జరిగే ఓ సభకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. ఆ సభకు ముకేశ్ దంపతులు కూడా వెళ్లారు. వారికి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని ఆలోచన ఉన్నా కూడా అది సాధ్యపడలేదు. చిన్నారిని బతికించుకోవాలని తాపత్రయంతో ముకేశ్ విపరీత చర్యకు పాల్పడ్డాడు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను వేదికపై విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది.. పాపను కాపాడి తల్లికి అప్పగించారు. ముకేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం.. వైద్యసాయం అందించాలని స్థానిక కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.