కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం లాకౌట్ ప్రకటించడంతో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలూ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిస్తు న్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఆఫీస్‌లో చేసిన పనికీ, ఇంట్లో చేసిన పనికీ తేడా కచ్చితంగా ఉంటుంది. ఎంత పోల్చుకున్నా ఆఫీస్‌లోనే పని ఎక్కువ జరుగుతుంది. ఇందుకు కారణం ఆఫీస్ ఎన్విరాన్‌మెంటే. ఉద్యోగులు పని చెయ్యడానికి అక్కడ అన్ని ఏర్పాట్లూ ఉంటాయి. ఈ కొత్త డిజిటల్ టెక్నాలజీ వల్ల విద్యార్థులు ఇంట్లో నుంచే పాఠాలు వినడం, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం జరుగుతుంది. అయితే, ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతున్నప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం కాదు అని చెప్పుకోవాలి.
ఇందులో ఉన్న సమస్యలను అధిగమిస్తూ ఫేస్‌బుక్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ పేరు “హారిజాన్ వర్క్ రూమ్”. ఇది వర్చువల్ టెక్నాలజీ సహాయంతో పనిచేస్తుంది. ఫేస్‌బుక్ హారిజాన్ వర్క్ రూమ్ వల్ల మనం ఇంట్లో ఉన్నప్పటికీ పాఠశాలలో, ఆఫీస్ లో, ఇతర సమావేశాలలో పాల్గొన్న అనుభూతిని కలిగిస్తుంది. భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఒకే వర్చువల్ రూమ్ లో కలిసి పాల్గొనవచ్చు.
లైవ్ వర్చువల్ క్లాస్ రూమ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ పవర్ తో నడిచే విద్యా రంగంలోని ఆధునిక సమస్యలకు పరిష్కారం. పాఠశాలల్లో సాంకేతికతను చేర్చాల్సిన అవసరం అర్థమైంది.వర్చువల్ క్లాస్ రూమ్ లో అన్ని విషయాలను చూడవచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు, ఇంటరాక్ట్ చేయవచ్చు, ఇన్‌స్ట్రక్టర్ తో వన్-టు-వన్ సెషన్ చేయవచ్చు. గదిని ఊహించుకొని సహోద్యోగులు కలిసి సమావేశంలో పాల్గొన్న అనుభూతి ఈ టెక్నాలజీ కల్పిస్తుంది.
ఇది వర్చువల్ రియాలిటీ, వెబ్ రెండింటిలోనూ పనిచేస్తుంది. బృందంతో భౌతికంగా కమ్యూనికేట్ అవ్వకుండానే వర్చువల్ పద్దతిలో వీఆర్ టెక్నాలజీ సహాయంతో కనెక్ట్ కావచ్చు. అలాగే, విద్యార్థులు ఇంట్లో ఉన్నప్పటికీ ఒక తరగతి గదిలో మీ టీచర్ చెప్పే పాఠాలను వినవచ్చు.