స్పోర్స్ట్ డెస్క్- క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు అంతా టీవీల ముందు వాలిపోతారు. ఇక మన ఇండియా మ్యాచ్ ఐతే గెలవాలని మనసులోనే కోరుకుంటారు. మగవాళ్లే కాదు, మహిళల క్రికెట్ కు కూడా మంచి పాపులారిటీ ఉంది. అందులోను మన ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్రత్యేకం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మొదట వన్డే సిరీస్ ఆడిన టీమిండియా, శుక్రవారం నార్తాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఓటమి పాలైంది. కానీ భారత యువ మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ పట్టిన క్యాచ్ మాత్రం అభిమానులను అబ్బురపరుస్తోంది. మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరగని క్యాచ్ అనే చెప్పాలి. పురుషుల క్రికెట్‌లోనే ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌లు చూస్తుంటాం.
ఐతే హర్లీన్ డియోల్ అందుకున్న ఈ క్యాచ్ ముందు అన్నీ దిగదుడుపే అని చెప్పక తప్పదు. మ్యాచ్‌లో శిఖా పాండే వేసిన 18వ ఓవర్‌లోని ఐదో బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ జోన్స్ భారీ షాట్ కొట్టింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ ఆ బంతిని అందుకుంది. అయితే సింపుల్ గా క్యాచ్ పడితే ఇంతలా ఎందుకు చెప్పుకుంటాం చెప్పండి. అద్భుతమైన డైవ్ చేసి మరీ క్యాచ్ పట్టి వారెవ్వా అనిపించింది. తన తల మీదుగా వస్తున్న బాల్ ను ఎడమవైపు గాల్లోకి డైవ్ చేసి పట్టుకునే ప్రయత్నం చేసింది. ఐతే క్యాచ్ పట్టే క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని గ్రహించిన డియోల్ వెంటనే బంతిని గాల్లోకి విసిరింది.
బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని క్యాచ్ పట్టేందుకు మళ్లీ మైదానంలోకి డైవ్ చేసింది. కాసేపు గ్రౌండ్ లోని ప్లేయర్లతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తమ కళ్లను తాము నమ్మలేకపోయారు. డియోల్ క్యాచ్‌తో విస్తుపోయిన అమీ జోన్స్ నిరాశగా పెవిలియన్ బాట పట్టింది. హర్లీన్ డియోల్ అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ అభిమానులతో పాటు, పలు రంగాలృ ప్రముఖులు సైతం హర్లీన్ డియోల్ కు అభినందనలు చెబుతున్నారు.
As good a catch one will ever see on a cricket field, from Harleen Deol. Absolutely top class. https://t.co/CKmB3uZ7OH
— VVS Laxman (@VVSLaxman281) July 10, 2021