Harleen Deol: ఆ ఫొటోలు చూస్తే.. ఎవరైనా ఓ స్టార్ హీరోయిన్ అయిఉంటుందని అనుకోవచ్చు. కానీ, ఆమె ఓ టీమిండియా క్రికెటర్. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా.. నిజం. మైదానంలో ఎండకు ఆడినా.. ఈ గ్లామర్‌గా ఉన్న ఆ క్రికెటర్ ఎవరంటే..?
దేశంలో సినిమాతో పాటు క్రికెట్‌కి అంతే పాపులారిటీ ఉంటుంది. కానీ ఉమెన్స్ క్రికెట్ కి మాత్రం అంతగా ఆదరణ దక్కట్లేదు. దీంతో వీరు బాగా ఆడినప్పటికీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మహిళా క్రికెటర్లు మాత్రం వారి ఆటతోనే కాదు అందంతోనూ గుర్తింపు పొందారు. ఈ లిస్టులో స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రియా పూనియా కూడా కొన్ని రోజులు తన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అయితే ఇప్పుడు హర్లీన్ డియోల్ తన అందంతో కుర్రాళ్ళ మనసు దోచే పనిలో ఉంది. ఏ మాత్రం ఖాళీ దొరికినా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన అందాన్ని మరింతగా చూపిస్తూ ఈ సారి బీచ్ దగ్గర దర్శనమిచ్చింది.
టాలెంట్ కి అందం తోడైతే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం గ్యారంటీ. సాధారణంగా హీరోయిన్ల విషయంలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఎందుకంటే సినిమా రంగంలో గ్లామర్ తప్పనిసరి. కానీ క్రీడా రంగంలో ఆటతో పాటు అందాలతో ఆకట్టుకునేవారు అరుదుగా ఉంటారు. వీరిలో హర్లీన్ డియోల్ ఒకరు. బౌండరీ రోప్ వద్ద డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తో బాగా పాపులర్ అయింది ఈ భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్. హర్లీన్ ఆటకన్నా గ్లామర్ కే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు గ్రౌండ్ లోనే కాదు బయట కూడా అపుడప్పుడు రచ్చ చేస్తూ కనిస్తుంది. తాజాగా ఈ క్రికెట్ బ్యూటీ బీచ్ లో చిల్ అవుతూ కనిపించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసినవారెవరైనా ఆమెను హీరోయిన్ అనుకోవాల్సిందే.
పొట్టి నిక్కరు వేసుకొని బీచ్ దగ్గర హర్లీన్ చిరునవ్వులు చిందించింది. కళ్లద్దాలు పెట్టుకొని చాలా స్టైలిష్ గా ఉంది. టైమ్ దొరికితే తొటి ప్లేయర్లతో రీల్స్ చేస్తూ కనిపించే ఈ ఆల్ రౌండర్.. ఈ సారి మాత్రం బీచ్ దగ్గర అందాల డోస్ పెంచేసింది. రెండు చేతుల్లో ఇసుక పట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. హీరోయిన్లు ఇలా చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా హర్లీన్ మాత్రం తన గ్లామర్ చూపించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. హాట్ లుక్కు లో హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అందరిని ఫిదా చేసేస్తోంది. మరి హర్లీన్ ఇలా హాట్ లుక్కులో ఫొటోలకు ఫోజులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.