అమావాస్య రోజు రవి, చంద్రులు ఒకే డిగ్రీలో ఉండడం వలన అమావాస్య ఏర్పడుతుంది, ఆరోజు రాత్రి చంద్రుడు కనిపించడు. చంద్రమానం ప్రకారం కృష్ణ పక్షము రోజులలో పదిహేనవ తిథి అయిన అమావాస్య రోజున సూర్య గ్రహణాలు సంభవిస్తాయి. ‘అమ’ అనే అవ్యయానికి ‘కలిసి ఉండటం’ అని అర్థం. అదే అమావాస్య. ‘ఎవరి కలయిక’ అంటే సూర్యుడు- చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడం. దక్షణాయణంలోని ఈ ‘తొలి అమావాస్య’ వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆరోజు వారికి తర్పణాలు సమర్పిస్తారు. ఇది మొదలు వారికి చేసే జపతపాలకు, పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి.
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కొత్తగా పెళ్ళైన కోడళ్లు ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి. కొందరు ‘అమావాస్య’ అంటేనే ఏదో అపవిత్రమని భయపడిపోతారు. కానీ, ఇది అత్యంత శక్తివంతమైన తిథి. ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆత్మలు శాంతించి, అనుగ్రహిస్తారన్న నమ్మకం బలంగా ఉంది. దీపావళి పండుగ సమయంలో మాత్రం అనేక పూజలు, వేడుకలు వంటివి అమావాస్య రోజే జరుగుతాయి.
పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక మార్గములో అభ్యున్నతి సాధిస్తారు. ఈ సమయంలో పూర్వీకుల శాంతి కోసం శ్రద్ధతో ఏవైనా ఆచారపరమైన పనులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చాలా మంది నమ్మకం. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, అనేక శుభకార్యా ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీ దేవిని పూజిస్తారు.
మరిన్ని వివరాల కోసం ఈ వీడియో వీక్షించండి: