ముందుండి నడిపే వాడే నాయకుడు అవుతాడు. ఈ కరోనా కష్ట కాలంలో ఇలా ప్రజలకి మనో ధైర్యాన్ని ఇస్తున్న నాయకులు ఎంత మంది ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చాక.., మంత్రులు, ఎమ్మెల్యే లు కాదు కదా.. కనీసం వార్డ్ మెంబర్స్ కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా పోయారు. ఇక మొన్నటి మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఆయా పార్టీల కోసం ప్రచారం చేసిన కార్యకర్తలకి కరోనా సోకింది. కానీ.., తరువాత కాలంలో ఆ కార్యకర్తలను ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక ఏపీలో మాత్రం కరోనా సెంటర్స్ ని మంచిగా నడిపిస్తున్నారు. రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉండటంతో ఇక్కడ కో-ఆర్డినేషన్ సమస్య రాకుండా.., కరోనా రోగులకు అన్నీ వసతులు కల్పించగలుగుతున్నారు. కానీ.., ఇలాంటి సేవలే అందిస్తున్న మిగతా రాష్ట్రాలలో మాత్రం ఈ కోవిడ్ సెంటర్స్ నరకాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కి చెందిన ఓ ఎంపీ ధైర్యంగా ముందు అడుగు వేశాడు. అంతే కాకుండా.., తానే స్వయంగా కోవిడ్ సెంటర్ లో బాత్ రూమ్ ని క్లీన్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకీ ఎంపీ ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్లోని టాయిలెట్ శుభ్రంచేశారు. ఆయన తన చేతులతో ఈ పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.స్వయంగా ఎంపీ ఇలాంటి పని చేయడం చూసిన అధికారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంపీ జనార్ధన్ మిశ్రా క్వారంటైన్ సెంటర్ను తనిఖీ చేసి… అక్కడి కోవిడ్ బాధితులను పరమార్శించి తిరిగి వెళ్తుండగా ఆయన టాయిలెట్ చాలా మురికిగా ఉండటాన్ని గమనించారు. వెంటనే దానిని శుభ్రం చేసే పనిలో పడ్డారు.ఎంపీ ఒక్కరే ఈ పనిని చేశారు. చేతులకు గ్లౌజులు ధరించి టాయిలెట్ను పరిశుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… తాను ఇటువంటి పని చేయడంద్వారా చాలామంది ఇటువంటి పనులు చేసేందుకు ముందుకు వస్తారని తెలిపారు. ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదని అన్నారు సదురు ఎంపీ. ఆ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క ప్రజా నాయకుడు కూడా కోవిడ్ సెంటర్స్ ని తనిఖీ చేయలేదు. అక్కడ ప్రజల అవస్థలను పట్టించుకోలేదు. వారంతా కరోనాకి బయపడి ఇంట్లోనే ఉండిపోయారు. వారికి కనువిప్పు కలగానే ఎంపీ ఈ పని చేశారట. మరి.., జనార్ధన్ మిశ్రా చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.