Gate Of The Sun: ఈ విశ్వం అందమైన పకృతితో పాటు అంతుచిక్కని మిస్టరీలకు కూడా పుట్టినిల్లు. సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు, మిస్టరీలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిన ఈ 21వ శతాబ్ధంలోనూ కొన్ని మిస్టరీలు ఛేధించబడలేదు. శాస్త్రవేత్తలు కొన్నింటిపై పరిశోధనలు చేసి విసిగి వేసారిపోయారు. చివరకు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అలాంటి వాటిలో సూర్య ద్వారం ఒకటి. గేట్ ఆఫ్ ది సన్‌గా పిలిచే ఈ సూర్య ద్వారం దక్షిణ అమెరికాలోని బొలివియాలో ఉంది.
ప్రాచీన రహస్య నగరంగా చెప్పబడే తివానాకూ నగరంలో ఆ ద్వారం ఉంది. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం.. మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తల నమ్మకం. ఇక, ఈ సూర్య ద్వారంపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి. వాటికి అర్థం ఏంటో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు. శాస్త్రవేత్తలకు సైతం ఆ విచిత్రమైన గీతలు, ఆకారాలు అంతుచిక్కని ప్రశ్నగా మారాయి.
కొంతమంది వీటిని పిచ్చి గీతలు అంటుంటే.. మరికొంతమంది ఇవి రాశి ఫలాల లాంటివి కావచ్చు అంటున్నారు. కానీ, వీటికి నిజంగా అర్థం ఏంటో ఎవ్వరికీ తెలియదు. మరి, ఈ సూర్య ద్వారంపై ఉన్న విచిత్రమైన గీతలు, ఆకారాలు ఏంటై ఉంటాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chittoor: రైతన్నకు ఎంత కష్టం వచ్చింది.. కుమారులనే కాడెద్దులుగా మార్చి!