గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇంతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం దుఖఃంలో మునిగిపోతున్నారు. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
బెంగాలీ గాయకురాలు అయిన నిర్మలా మిశ్ర గుండెపోటుతో మరణించారు. ఆమె కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన నివాసంలోనే ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. బెంగాలీలోనే కాకుండా ఒరియాలో కూడా ఆమె పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 1938లో జన్మించిన నిర్మలా మిశ్రా చిన్ననాటి నుంచి సంగీతంపై మంచి పట్టు సాధించారు.
పఒరియా సంగీతానికి ఎనలేని సేవలు చేసిన ఆమెకు సంగీత్ సుధాకర్ బాలకృష్ణ దాస్ అవార్డు లభించింది. ఆమె పాడిన పాటల్లో ‘ఎమోన్ ఏక్తా జినుక్’,‘బోలో తో అర్షి’ అలాగే’, ‘ఇ బంగ్లార్ మతి చాయ్’ ఎంతో ఫేమస్ గా నిలిచాయి. ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నిర్మలా మిశ్రా.. మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.