ఆమె పేరు చాలామందికి తెలియదు. కానీ గోదావరి స్లాంగ్ లో 'కూలెక్కలేదా వాటరు' అని చెప్పిన డైలాగ్ మాత్రం చాలా ఫేమస్. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిపోయిన ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. సినిమా పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుంది. కొందరికి పెద్దోడు-చిన్నోడు బాండింగ్ గుర్తొస్తే.. మరికొందరికి మాత్రం రేలంగి మామయ్య నవ్వు గుర్తొస్తుంది. 2013 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన సినిమా అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఇందులోని ఫొటోల్ని ఎన్నెన్ని రకాలుగా ఉపయోగించారో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలోనే హీరోయిన్ కూడా ఉండే గ్యాంగ్ లో నటించిన ఓ పిల్ల.. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. మరి ఇప్పుడామె ఎలా ఉందో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మీ అందరికీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుందో తెలియదు గానీ నాకు మాత్రం.. ‘ఏంటి కూలెక్కలేదా వాటరు’ అనే డైలాగ్ వేసిన చిన్నారినే తెగ గుర్తొస్తుంది. గోదావరి యాసలో పలికిన ఆ ఒక్క డైలాగ్ తో తెగ ఫేమస్ అయిపోయింది. ఆ చిన్నారి పేరు రచన. ‘svsc’ తర్వాత వేరే సినిమాలు ఏమైనా చేసిందా అంటే మాకు తెలిసినంత వరకు లేదు. కానీ ఈ మూవీ రిలీజైన ఆరేళ్లకు అంటే 2019 జూన్ లో పెళ్లి చేసుకుంది. 2020 మే వచ్చేసరికి కూతురికి జన్మనిచ్చింది. అలా తల్లి అయిపోయింది.
ఇక భర్తతో కలిసి ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్న రచనకు ఈ ఏడాది జనవరిలో మరో పాప పుట్టింది. అలా ఇద్దరమ్మాయిలకు తల్లి అయిపోయిన ఈమె.. తనలోని యాక్టింగ్ టాలెంట్ ని మాత్రం అస్సలు మర్చిపోలేదు. దేశానికి, టాలీవుడ్ కు దూరమైపోయినా సరే ఇన్ స్టా రీల్స్ లో ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమెకి ఇన్ స్టాలో లక్షా 70 వేల మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉండటం విశేషం. మరోవైపు యూట్యూబ్ లో 40 వేల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇలా నటనకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉంది. మరి ఈమె యాక్టింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? కింద కామెంట్ చేయండి.