తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడులైంది. ఈ మూవీలో అల్లూరిగా చరణ్, కొమరం భీంగా తారక్ పాత్రలను పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు.
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ మూవీ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ టీం నిన్న రాత్రి సినిమా చూసింది. అందుకోసం ‘ఆర్ఆర్ఆర్’ టీంకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. ప్రీమియర్ షో మొదలైనప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’టీం మొత్తం బస్సుల్లోనే థియేటర్లకు వెళ్లింది. రాజమౌళి, హీరో రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ యూనిట్ లోని పలువురు ప్రముఖులు బస్సులో థియేటర్ కు చేరుకున్నారు.
సినిమా చూసేందుకు ప్రత్యేక బస్సులు వేస్తున్నందుకు చిత్ర బృందం ధన్యావాదాలు అని పేర్కొంది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ అభిమానులు హంగామా చేస్తున్నారు. బస్సులో వచ్చిన చిత్ర బృందానికి అభిమానులు జెండాలు పట్టుకుని ఘన స్వాగతం పలికారు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.
Team #RRRMovie travelled in #TSRTC Bus for Theater Visit!! 🔥🤩@tsrtcmdoffice #RamCharan #SSRajamouli #JrNTR #TeluguFilmNagar #TFNReels pic.twitter.com/zvx743kgJQ
— Telugu FilmNagar (@telugufilmnagar) March 25, 2022